telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను చేసి నివేదిక రూపొందించాలని ఆయన తెలిపారు.

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసే అంశంపై చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.

Related posts