telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో కూడిన చిత్రం రుద్రమాంబపురం : హీరో శ్రీకాంత్ !!!

అజ‌య్ ఘోష్‌, శుభోద‌యం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. మూల కథ అజయ్ ఘోష్.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసారు. ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లి గంజ్ పాడగా,
భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు. రుద్ర‌మాంబ‌పురం జులై 6నుండి హాట్ స్టార్ లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…
ఎన్. వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రంలో తిరుపతి పాత్ర లో అజయ్ గోష్, నటిస్తున్నారు, పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌: నండూరి రాము
ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు
బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్
క‌థ‌: అజ‌య్ ఘోష్
డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి
సంగీతం: వెంగీ
ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రావు
ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు
ఫైట్స్‌: దేవ‌రాజు
కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు
సీఈఓ: అన్నింగి రాజ‌శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను
పీఆర్ఓ: శ్రీధర్

Jatara Song Link: https://youtu.be/nEkuvrgW1Dk

Related posts