telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు.

వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి వ్యవస్థలన్నీ అగమ్యగోచరమని తెలిపారు సీఎం చంద్రబాబు.

‘ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. ఈరోజు ఆటో డ్రైవర్‌ల పండుగలో ఉన్నాం. ఆయుధ పూజ తరహలో వాహన పూజ చేశారు.

సెల్‌ఫోన్లు చూసుకొండి డబ్బులు వచ్చాయా చూసుకున్నారా. కన్పర్మేషన్ మెజేస్ అందుకున్నారా అని అడిగారు. అవును రూ.15 వేలు వచ్చాయని ఆటోడ్రైవర్‌లు తెలిపారు.

తమ ప్రభుత్వంలో లంచాలు లేవు, తిరిగే పనిలేదు మొత్తం వచ్చింది అదే టెక్నాలజీ. ఆటో డ్రైవర్‌లు పేమెంట్లు అన్ని సెల్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు.

ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు చెప్పిన రోజు చెప్పినట్లుగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.

ఆటోడ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి రోడ్లు అన్ని అధ్వానంగా ఉన్నాయి. నేను, పవన్ కల్యాణ్ , బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు ఇచ్చాం. 94శాతం స్ట్రైయిక్ రేటు వచ్చింది.

రానున్న రోజుల్లో ఈ స్ట్రైయిక్ రేటు పెరగాలి. 16 నెలల క్రితం అంతా అగమ్య గోచరం. రాత్రి, పగలు ఆలోచించాం.

ఏపీని కాపాడటానికి ఉద్యమ స్పూర్తితో వచ్చాం. చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా. 175 నియోజకవర్గాలల్లో ఆటో డ్రైవర్‌ల పండుగ జరుగుతోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts