telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రానికి రైతు సంఘాల అల్టిమేటం.. మూడు చట్టాలు రద్దు చేయాల్సిందే

కేంద్రానికి రైతు సంఘాల అల్టిమేటం జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్ లో కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు రైతులు. ఇవాళ్టి చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు తీవ్రతరంచేయాలని నిర్ణయించారు రైతు సంఘాల నేతలు. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని… భవిష్యత్ ఆందోళన కార్యచరణన వెల్లడించారు రైతు సంఘాల నేతలు. దేశ రాజధాని ఢిల్లీ సహా రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో జనవరి 26న “కిసాన్ గణతంత్ర పరేడ్” నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6 నుంచి 20 వరకు “దేశ జాగృతి అభియాన్” కార్యచరణ నిర్వహించనున్నారు. “దేశ జాగృతి అభియాన్” కార్యచరణలో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6న షాజహాన్ పూర్ వద్ద రోడ్లపై బైఠాయించిన రైతులు ఢిల్లీ వైపు మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

భోగి, సంక్రాంతి సందర్భంగా “కిసాన్ సంకల్ప్ దివస్” జరువుతూ మూడు వ్యవసాయ చట్టాలను తగలబెట్టాలని నిర్ణయం తీసుకోగా.. జనవరి 18న “మహిళా కిసాన్ దివస్”, జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా “ఆజాద్ హింద్ కిసాన్ దివస్” జరపాలని నిర్ణయం వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్ల అధికారిక నివాసాల ఎదుట ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26న ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర పరేడ్ అనంతరం..”కిసాన్ పరేడ్” నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం..కేంద్రం ఏవిధంగా చట్టం చేస్తుందని ప్రశ్నించిన రైతు సంఘాల నేతలు…. పంటలకు మద్దతు ధర C2+50 శాతం ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో, పంట ఉత్పత్తులకు “కనీస మద్దతు ధర” అమలుకు చట్టబద్దత విషయంలో కేంద్రాన్ని ఏవిధంగా నమ్మగలమని ప్రశ్నించారు. మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ అనుకూల చట్టాలని అనేక రకాలుగా కేంద్రానికి వివరించామని.. ఖచ్చితంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts