ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు.
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేశ్ తో కలిసి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.
ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
డీప్‌టెక్, కృత్రిమ మేధ, సుస్థిర, సమ్మిళిత ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తామని ఆయన అన్నారు.
సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.