telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆరోగ్య శాఖ కు మంత్రే లేదు.. కెసిఆర్ సిగ్గుపడాలి

తెలంగాణకు ఆరోగ్య శాఖ కు మంత్రి లేడు.. సీఎం కెసిఆర్ డైలీ సమీక్ష చేస్తున్నారా అని ఫైర్ అయ్యారు ఉత్తమ్. తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని.. టెస్టింగ్ లేకుండా నే కరోనా కేసులు తెలంగాణలో తగ్గుతున్నాయి అని ఎలా అంటారని మండపడ్డారు. అయుష్మాన్ భారత్ లో కరోనా ట్రీట్మెంట్ ఉచితమని..కనీసం దాన్ని అయినా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది..? మీడియా వాళ్ళను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కి వచ్చే ఇబ్బంది ఏంది ? కింగ్ కోఠి ఆసుపత్రిలో అక్షిజన్ లేక జనం చనిపోతే ఎవరు బాధ్యులు అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత కాదా..? Tims లో ఆక్సిజన్ లేకుండా చనిపోతే ప్రభుత్వ బాధ్యత కాదా..? అని నిలదీశారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.

Related posts