ఈ ఏడాది ఫిబ్రవరి 11న అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక్కరోజు ‘ధర్మ పోరాట దీక్ష’ జరిగింది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చడం లేదంటూ ఈ దీక్షను చేపట్టారు. అయితే, దీనికి రూ. 10 కోట్లు ఖర్చు కావడంపై ఏపీ హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఒక కార్యక్రమానికి ఇంత మొత్తం ఖర్చు కావడాన్ని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీని పై నిన్న హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అధికార పార్టీ లబ్ధి కోసం ఈ దీక్షను చేపట్టారని, దీనికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. దీంతో, రూ. 10 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసిన అధికారి ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. ఏ నిబంధనల మేరకు ఈ నిధులను విడుదల చేశారని అడిగింది. సమస్యల పరిష్కారం కోసం ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స