telugu navyamedia
వ్యాపార వార్తలు

తగ్గనున్న నూనె ధరలు..

గత కొంతకాలంగా దేశ మార్కెట్‎లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఏ బ్రాండ్ వంట నూనె అయినా లీటర్ రూ.150కు తక్కువగా లేదు. వంట నూనెల ధరల వినియోగదారులపై పెను భారాన్ని మోపుతున్నాయి.ఏడాది కాలంలోనే వంట నూనెల ధరలు 20 నుంచి 50 శాతం వరకు ఎగబాకాయి. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడుతోంది.

ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెడగడం మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలు తగ్గించే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

खाद्यतेल महाग, गृहिणींना वैताग! – तरुण भारत

వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ… వ్యాపారుల వద్ద నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. పరిమితులు మార్చి 2022 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్​సీడీఈఎక్స్​ ప్లాట్​ఫామ్​పై..మస్టర్డ్​ ఆయిల్ ట్రేడింగ్‎ను అక్టోబర్​ 8 నుంచి నిలిపివేశారు.

కేంద్రం తాజా నిర్ణయంతో దేశీయ మార్కెట్లలో నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించే విషయం’ అని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts