telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు సిద్ధమైన టాటా గ్రూప్‌…

ratan tata on startup investments

టాటా ఎయిర్‌లైన్స్‌ పేరిట 1932లో టాటా గ్రూప్‌ నెలకొల్పిన సంస్థ 1946లో ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వపరమయ్యింది. సరిగ్గా 67 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఎయిర్‌లైన్స్‌ను టాటా సన్స్‌ కొనుగోలుకు ముందుకొచ్చింది. అయితే ఇప్పుడు పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను కొనుగోలుకు టాటా గ్రూప్‌ ఆసక్తి చూపుతోంది. దీనిలో భాగంగా బిడ్‌ను దాఖలు చేసింది. ఈవోఐకు ఇవాళ్టి సాయంత్రం గడువు ముగిసింది. దీంతో టాటా సన్స్‌ చివరి రోజు ఈవోఐను దాఖలు చేసింది. బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే సింగపూర్‌తో కలిసి విస్తారాను, మలేసియాకు చెందిన ఎయిరేషియా భాగస్వామ్యంతో ఎయిరేషియా ఇండియా విమానాలను టాటా గ్రూప్‌ నడుపుతోంది. అయితే, ఎయిరిండియా కొనుగోలుకు ఒంటరిగానే వెళుతుందా..? లేక ఎవరితోనైనా భాగస్వామితో ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.మరోవైపు ఎయిరిండియా బిడ్డింగ్‌ చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఎయిరిండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్‌ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ బిడ్‌కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షీ మల్లిక్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Related posts