telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర

ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే.. తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 45,440 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 41,650 పలుకుతోంది. బంగారం ధర తగ్గితే… వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 100 పెరిగి 71,100గా నమోదైంది.

Related posts