telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయినవి.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు హామీ ఇచ్చిన ప్రకారం రూ.1200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ఈ వారంలో రూ. 600 కోట్లు, దీపావళికి మరో రూ. 600 కోట్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

గత బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

బీఆర్ఎస్ రీయింబర్స్‌మెంట్ ఫీజులు చెల్లించకుండా ఆ భారాన్ని తమ మీద మోపిందని విమర్శించారు. గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిన వ్యవస్థల్ని తాము సరి చేసుకుంటూ వెళ్తున్నామని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వానికి భారమైన రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

కాలేజీ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్ విరమణకు అంగీకరించాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య(ఫాతీ) అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమస్య తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది.

ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఓకే చెప్పిడంతో కథ సుఖాంతం అయ్యింది.

Related posts