ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కొన్ని రోజులక్రితం వేటు వేసింది. ఇది ఇలా ఉండగా… తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో అక్షరాల రూ.52 లక్షలు పాట పడాడు ఓ వ్యక్తి. అయినా సరే ఎన్నికలకు వెళ్లాలని గ్రామ పెద్దల నిర్ణయం తీసుకున్నారు. పాట పాడుకున్న వ్యక్తికి గ్రామస్తులు మద్దతుకు ఒప్పందం కుదిరింది. ఓడిపోతే డబ్బులు ఇవ్వక్కర లేకుండా.. గెలిస్తే రూ.52 లక్షలు ఇచ్చేలా ఒప్పందం ఖరారు అయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్. ఈ పర్యటనలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఎస్ఈసీ. ఫిబ్రవరి 1 న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించి పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సమీక్షించనున్న నిమ్మగడ్డ.. అదేరోజు విశాఖలో బస చేయనున్నారు. మరుసటి రోజు విశాఖపట్నం, కాకినాడ, ఏలూరులలో ఆయా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు ఎస్ఈసి. 2వ తేది రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
previous post
next post