గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ విషయం చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వర్షాలతో 30 మందికి పైగా మరణించారు. అయితే హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రోజుకో సెటైర్ వేస్తున్నారు. కొందరు ఓలా, ఉబర్ యాప్ ల్లో బోటు సర్వీస్ అవకాశం ఉందా అని అడుగుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా హైదరాబాద్ వరదలపై సెటైర్ వేసాడు. “ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి చెప్పండి ప్లీజ్” అని ట్వీట్ చేసాడు బ్రహ్మాజీ. అలాగే తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫోటోలను పోస్ట్ చేసాడు బ్రహ్మాజీ. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు సూచనలు చేస్తుంటే..మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇపుడు ఆయన ట్వీట్ వైరల్ అయింది.
previous post
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్