బాలీవుడ్ స్టార్ హీరో.. సెన్సేషన్‌కి కేరాఫ్‌గా నిలిచే రణ్ వీర్ సింగ్ షాకింగ్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. న్యూడ్ ఫోటో షూట్‌తో బాలీవుడ్ వర్గాలను ఉలిక్కిపాటుకు గురి చేశారు.
ఒకప్పుడు బోల్డ్ ఫొటోలు అంటే కేవలం హీరోయిన్లకు మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ఇటీవల రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో భాగంగా బోల్డ్ లుక్‌లో కనిపించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఓ మేగజీన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేశారు.
ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా ఫోటోలకు పోజులిచ్చారు. నిర్మొహమాటంగా ఆయన ఇలాంటి హాట్ పోజులివ్వడంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక లేడీ అభిమానులకైతే మైండ్ బ్లాంక్ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
అయితే ఈ న్యూడ్ పిక్స్ పై పలువురు నెటిజన్లు స్సందించారు. కొందరు నటుడిని హాట్ అని పిలుస్తుండగా.. మరికొందరు ఆయన పూర్తి నగ్నంగా ఉండడంపై విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ‘ఇదేం పని’, ‘బాలీవుడ్‌ని వదిలేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు.
దీంతో ఈ పిక్స్‌పై రణ్‌వీర్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు .. ‘పబ్లిక్‌గా నగ్న ఫొటోలకి స్టిల్స్ ఇవ్వడం నాకు కష్టంకాదు. అందుకే కొన్ని ప్రదర్శనలలో నేను నగ్నంగా చేయగలిగాను. అందులో మీరు నా ఆత్మను చూడొచ్చు. నేను వేలమంది ముందు నగ్నంగా ఉండగలను. కానీ.. జనాలు అసౌకర్యానికి గురయితే నేనేం చేయలేను’ అని చెప్పుకొచ్చాడు.
కాగా..రణ్‌వీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్ ’ అనే మూవీని చేస్తున్నాడు. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. అలాగే అలియా భట్‌తో కలిసి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే మూవీలో నటిస్తున్నాడు