telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనవడితో బాలయ్య… పిక్ వైరల్

NBK

నటసింహం నందమూరి బాల‌కృష్ణ త‌న మ‌న‌వ‌డితో క‌లిసి దిగిన ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. క్యూట్ గా ఉన్న మ‌న‌వ‌డు ఆర్య‌వీర్ ను ఒడిలో కూర్చోబెట్టుకొని కెమెరాకు ఫోజులిచ్చాడు. మ‌ల్టీక‌ల‌ర్ లో ఉన్న‌ డిజైన్ డ్ కుర్తా ధ‌రించిన బాల‌య్య మ‌న‌వ‌డితో క‌లిసి దిగిన ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ లో హీరోయిన్ గా సాయేషా సైగల్ నటిస్తోంది.

Related posts