telugu navyamedia
ఆరోగ్యం

బెల్లంతో బ్ల‌డ్ లెవ‌ల్స్ కంట్రోల్‌..!

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది రోజూ బెల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కాకుండా పాల‌ల్లో బెల్లం కలిపి తాగితే ఎముకలు దృఢంగా మారతాయి. రక్తహీనతను తగ్గించే ఐరన్‌ బెల్లంలో ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్త కణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్స్‌, మినరల్స్‌ ఇందులో పుష్క‌లంగా ఉంటాయి.

బెల్లంతో ప్ర‌యోజ‌నాలుః-
1. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది.
2. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.
3. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
4. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.
5. బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
6. బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
7.మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
8.బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
9. మహిళలు బెల్లాన్ని సేవించడం వ‌ల్ల రక్తంలోని హీమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి.
10. షూగ‌ర్ వ్యాధి ఉన్న‌వాళ్ళు బెల్లం సేవించ‌డం వ‌ల‌న షూగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది.

Related posts