telugu navyamedia
ఆరోగ్యం

బాదంతో ఆరోగ్యం..!

గుండె ఆరోగ్యాన్ని పెంపొంస్తుంది..
ఎముక‌ల‌ను దృఢంగా మార‌స్తుంది…
శ‌క్తిని పెంపొందిస్తుంది..
మెద‌డును చురుగ్గా చేస్తుంది..
జుట్టు రాల‌డాన్ని అరిక‌డుతుంది..
గ‌ర్భీణీ స్ర్తీల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది..
బ‌రువును క‌ట్ట‌డి చేస్తుంది..

బాదం ప‌ప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మ‌రీముఖ్యంగా నాన‌బెట్టిన మ‌రింత మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే మూడు, నాలుగు బాదంపప్పులను నానబెట్టినవి తినడం మంచిది. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి.

అయితే గర్బిణీ స్త్రీలు బాదం పప్పు తినడం మంచిదే అంటున్నారు నిపుణులు. గర్భిణీలు పలు రకాల వంటకాలలో బాదం పప్పును తీసుకోవాలట. అయితే గర్భిణీ స్త్రీలు నానబెట్టిన బాదం పప్పు తినవచ్చా ? వారి ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి.

గర్భధారణ సమయంలో మహిళలు పచ్చి బాదం తినడం సురక్షితమే. వాటిలో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే గర్భిణీ స్త్రీకి బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్‌లకు అలర్జీ ఉంటే ఖచ్చితంగా బాదం తినడం మానుకోవాలి. బాదం ప‌ప్పును తిన‌డం వ‌ల‌న రక్త ప్ర‌స‌ర‌ణ సాధార‌ణ స్థితిలో ఉంటుంది.

రోజూ గుప్పెడు నాన‌బెటి్ట‌న బాదం గింజ‌ల‌ను తింటే జుట్టు రాల‌డం కూడా త‌గ్గిస్తుంది, అలాగే అధిక బ‌రువును త‌గ్గిస్తుంది. అంతే కాకుండా ఎముక‌ల‌ను దృడంగా చేస్తుంది.

Related posts