telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొన్ని ఏళ్లుగా అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేదు…ఇక నేను ప్రశ్నిస్తా !

Raghunandan

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసన సభ ,శాసన మండలి సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్ రావు , రాజసింగ్ లు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ… ప్రజల పక్షాన పాలకుల తప్పిదాలను ఎండగడుతానని అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పేర్కొన్నారు రఘునందన్ రావు. గత కొన్ని ఏళ్లుగా నిండు శాసనసభలో ప్రజా గొంతుక వినిపించే వారు లేరని… దుబ్బాక ప్రజలు…సమస్యల తరుఫున తనను శాసన సభలోకి పంపారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తానని… సహచర ఎమ్మెల్యే రాజసింగ్ తో కలిసి ప్రజా సమస్యలపై గళం విప్పుతనని వెల్లడించారు. పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టం చేశారు.

Related posts