*హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
*స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నేతలు..
*శంషాబాద్ నోవాటెల్ లో బీజేపీ నేతలతో భేటి
*కాసేపట్లో మీథలీరాజ్‌తో భేటి..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. జేపీ నడ్డాతో పాటు ఆయన సతీమణి కూడా నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.
ఇక, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
అనంతరం జేపీ నడ్డా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడే భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ కానున్నారు. ఇందుకోసం మిథాలీరాజ్ ఇప్పటికే నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. వరంగల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు.
అనంతరం, మధ్యాహ్నం 3.45 గంటలకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొ.. వెంకటనారాయణ నివాసానికి నడ్డా చేరుకుని వారితో మాట్లాడతారు. సాయంత్రం 4.10 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌కి నడ్డా చేరుకుంటారు. వరంగల్ సభ అనంతరం హైదరాబాద్‌కు జేపీ నడ్డా తిరుగుపయనం అవుతారు. రాత్రి 7.30 గంటలకు నోవాటెల్‌లో నటుడు నితిన్‌తో నడ్డా భేటీ కానున్నారు.