telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు

Somu Veerraju BJP

ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజును పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సన్మానించారు.

ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో నాడు చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చిచెప్పారు. అయితే ఏపీ బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందన్నారు. టీడీపీ, బీజేపీల్లా తమది కుటుంబ పార్టీ కాదని, బీజేపీ సకల జనుల పార్టీ అని అన్నారు. ఇళ్ల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

Related posts