telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి…

టీచర్ల ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ… మా అభ్యంతరాలు సీఎస్ కమిటీ కి తెలిపాము. రిపోర్ట్ చూసి నివ్వెర పోయాం, ఉద్యోగులు మానసిక ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయులు సంతోషంగా ఉండకుంటే ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించలేదు. ప్రభుత్వం ఇంత కఠినంగా ఉండడం సమంజసం కాదు. ఉద్యోగ,ఉపాధ్యాయులు ప్రభుత్వంకి సహకరిస్తేనే పథకాలు సఫలం అవుతాయి. పదవి విరమణ వయస్సు ని 60 ఏళ్లకు ఈ నెల నుండే పెంచాలి. సీఎంకి గురువులు అంటే ప్రేమ.. గురువుల సమస్యలు పరిష్కరించాలి అని పేర్కొన్నారు. ఇక పీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 7.5 ఫిట్మెంట్ ఎట్టి పరిస్థితిలో ఆమోద యోగ్యం కాదు. 45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి అని తెలిపారు.  మా అభిప్రాయాలు సీఎంకి తెలుపుతామని చెప్పారు. ఉపాధ్యాయ పిల్లలకు ట్యూషన్ ఫీ చెల్లించాలి. విద్యా శాఖ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరికి బేసిక్ సాలరీ పెంచాలి. Cps విధానంని రద్దు చేయాలని కోరాము అని చెప్పిన ఆయన అన్ని అలవెన్సులు 50 శాతం పెంచాలి. కోవిడ్ ఆర్థిక పరిస్థితి నుండి ఇప్పుడిపుడే మెరుగు పడుతుంది.. మీరు కొరినంత ఇవ్వలేము అని సీఎస్ కమిటీ చెప్పింది. కానీ మేము చెప్పిన ఫిట్మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశాము అని శ్రీపాల్ రెడ్డి అన్నారు.

Related posts