తమిళ స్టార్ హీరో విజయ్‌కి కోలీవుడ్‌లోనే కాక వేరే భాషలలోను ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న 63వ చిత్రం బిగిల్ 2020లో రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న బిగిల్ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో విజయ్ డ్యూయల్ షేడ్స్‌లో కనిపించనుండగా, అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర కాగా, మరొకటి ఫుట్‌బాల్ ప్లేయర్ పాత్ర అని తెలుస్తుంది. అట్లీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ – అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన తెరీ, మెర్సల్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ అనే చెప్పాలి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post