telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అతిపెద్ద థియేటర్ లో .. సాహో విడుదల..

biggest theater opening with saaho release

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ లు, ‘వీ’ సెల్యులాయిడ్‌ పేరిట మూడు స్క్రీన్ల సినీ కాంప్లెక్స్‌ ను నిర్మించారు. రేపు విడుదల కానున్న ‘సాహో’తో ఈ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ గా ఇది ఖ్యాతి గాంచింది.

ఈ థియేటర్ విశేషాలను పరిశీలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించారు. ఒక థియేటర్‌ లో ఉన్న స్క్రీన్ వెడల్పు 106 అడుగులు కాగా, నిలువు 94 అడుగులు. ఈ థియేటర్ లో మొత్తం 670 సీట్లు ఉంటాయి. త్రీ డైమన్షన్ సౌండ్‌ సిస్టమ్‌ తో ఉంటుంది. మిగతా రెండు థియేటర్లనూ 180 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 7 ఎకరాల్లో ఈ థియేటర్లు ఉంటాయి. ఇక ఈ కొత్త స్క్రీన్లను రేపు ప్రభాస్‌ ప్రారంభిస్తారని సమాచారం.

Related posts