telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసు : దీపికా బయటపెట్టింది ఈ ముగ్గురు హీరోల పేర్లేనా ?

deepika

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తున్నాయి. నెపోటిజం ఇష్యూ మొదలుకొని డ్రగ్స్ ఆరోపణల వరకూ బయటకొస్తున్న అన్ని విషయాలు బీ టౌన్ వర్గాలను వణికిస్తున్నాయి. బడా హీరోలుహీరోయిన్లు, దర్శకనిర్మాతలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకోగా.. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులను విచారించి వారి మొబైల్ ఫాన్స్ స్వాధీన పర్చుకున్నారు ఎన్‌సీబీ అధికారులు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే నార్కోటిక్ అధికారుల ముందుకు వెళ్లిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. ముగ్గురు కోస్టార్ల పేర్లను కోడ్ చేస్తూ ”ఏ, ఎస్, ఆర్” అనే నేమ్స్‌ వెల్లడించినట్లు సమాచారం. ఈ ముగ్గురూ గ‌తంలో దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన‌వారేన‌ని మ‌రో హింట్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ కోడ్స్‌లో ‘ఎస్’ అంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అని, ‘ఏ’ అంటే అర్జున్ రాంపాల్ అని మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇకపోతే ‘ఆర్’ అనే కోడ్‌పై ఎవ్వరి పేరు బయటకు రానప్పటికీ దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే డ్రగ్స్ ఇష్యూ స్టార్ హీరోలకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపికా వెల్లడించిన ఆ ముగ్గురు హీరోలకు సమన్లు జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. వీళ్ళే కాకుండా కరణ్ జోహార్ సహా మరో ఏడుగురు కీలక వ్యక్తుల పేర్లు కూడా ఎన్‌సీబీ అధికారుల లిస్టులో ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ అంశంపై అందరినీ లోతుగా విచారించాలని ఫిక్స్ అయ్యారట అధికారులు.

Related posts