telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : 8వ వారం మరో వైల్డ్ కార్డు ఎంట్రీ…!

Bigg-Boss

బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్ షో పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ హౌజ్‌లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు, లవ్ స్టోరీలు, గొడవలు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోలతో, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది. సీజన్ 4 లో నటి మోనాల్ తన అందచందాలతో కట్టిపడేస్తూ.. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ కారణంగానే మోనాల్ ను కావాలనే ఎలిమినేట్ కాకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఈ షోలో ఇప్పటికి ముగ్గురు సెలెబ్రెటీస్ కుమార్ సాయి, అవినాష్, స్వాతీ దీక్షిత్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ లు ఎలిమినేట్ కూడా అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ షో లోకి ప్రముఖ సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఇప్పటికి 7 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4, 8వ వారంలోకి వచ్చింది. ఈ వారం లో 4వ వైల్డ్ కార్డు హౌస్ మెట్ గా ఆమె ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి. అయితే బిగ్ బాస్-4కు సంబంధించిన చాలా విషయాలు ముందుగానే లీక్ అవుతుండడం గమనార్హం.

Related posts