telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దివికి స్టేజి పైనే మూవీ ఆఫర్ ఇప్పించిన సమంత

Divi

బిగ్‌బాస్‌ 4 ఆసక్తికరంగా సాగుతోంది.హోస్ట్ నాగార్జున షూటింగ్‌లో ఉండటంతో నిన్నటి ఎపిసోడ్‌కి సమంత హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఆదివారం పండుగ కావడం, నాగ్‌ కూడా లేకపోవడంతో నామినేషన్‌ ఉండదని అందరూ భావించారు. కానీ అందరికీ షాకిస్తూ ఆదివారం ఎపిసోడ్ లో దివి ఎలిమినేట్ అయ్యింది. మొదటగా అరియానా సేవ్ అయ్యింది. ఆ తరువాత మోనాల్‌, నోయల్‌, అభిజిత్‌లు వరుసగా సేవ్‌ అయ్యారు. చివరగా అవినాష్‌, దివిలు మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరిలో దివి ఎలిమినేట్ అయినట్టు సమంత వెల్లడించారు. అయితే దివి “పండుగ రోజు వెళ్తున్నా ఏం బాధలేదు. బయట ఎవరు ఏం అనుకున్నా నాకు రాజశేఖర్ మాస్టర్‌ అమ్మాలాంటి వారు. నా ప్రవర్తన వలన ఎవరైనా బాధపడి ఉంటే సారీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కి థాంక్స్. ఇక్కడ నుంచి నా కెరీర్‌ స్టార్ట్ అవుతుంది” అని పాజిటివ్ గా మాట్లాడింది. కాగా దివి ఎలిమినేట్‌ సందర్భంగా అమ్మ రాజశేఖర్ చాలా ఏడ్చారు. ఇక దివి బిగ్‌బాంబ్‌ని లాస్యపై విసిరింది. దాని ప్రకారం వారం రోజుల పాటు లాస్య మాత్రమే వంట చేయాలి. ఆమెకు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉంటుంది. మరోవైపు స్టేజ్ మీదికి హీరో కార్తికేయ కూడా రాగా.. అతడి సినిమాలో దివికి ఛాన్స్ ఇవ్వాలని సమంత కోరింది. కార్తికేయ కూడా తప్పకుండా ఛాన్స్ ఇస్తానని చెప్పాడు.

Related posts