telugu navyamedia
సినిమా వార్తలు

మా ఎన్నిక‌ల్లో కొత్త మ‌లుపు.. జోరుగా నైట్ పార్టీలు..

మా అధ్యక్షుడు నరేష్‌ విందు రాజకీయాలకు..
మా ఎన్నిక‌లు కోసం జోరుగా నైట్ పార్టీలు..
రసవత్తరంగా మా ఎన్నిక‌లు ..
మా ఎన్నిక‌ల్లో కొత్త మ‌లుపు..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ త‌ల‌పిస్తున్నాయి. కేవ‌లం రెండేళ్ళ పాటు ఉండే (మా) అధ్య‌క్ష ప‌ద‌వి కోసం న‌టీన‌టులు తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు మాట‌ల‌కే ప‌రిమిత‌మైన రాజకీయం ఇప్పుడు కొత్త మ‌లుపు తీసుకుంది.

MAA Elections: Naresh Upset With Nagababu's Words

తాజాగా మా అధ్యక్షుడు న‌రేస్ హిందూ రాజ‌కీయాల‌కు తెర‌తీసారు. ప్ర‌స్తుతం ఆయ‌న పేరుతో ఒక ఆహ్వాన సందేశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. శ‌నివారం ఏర్పాటు చేసిన పార్టీకి త‌ప్ప‌కుండా రావాల‌ని ఒక మెసేజ్ ప‌లువురు న‌టీన‌టులు వాట్సాప్ గ్రూప్‌ల్లో స‌ర్క్యూలేట్‌ అవుతుంది.

హైదరాబాద్‌లోని దశ్‌పల్లా ఫోరమ్‌ హాల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ విందు కార్యక్రమానికి రావాల‌ని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మెసేజ్‌ డాక్టర్‌ నరేష్‌ విజయ్‌కృష్ణ పేరుతో వైరల్‌ అవుతోంది.

Related posts