telugu navyamedia
క్రీడలు వార్తలు

వారికీ భువనేశ్వర్‌ వార్మింగ్…

త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి భువనేశ్వర్‌ కుమార్‌ టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటుంన్నాడు అని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. భువీకి పరిమిత ఓవర్ల ఫార్మాట్ మాత్రమే ఆడడం ఇష్టమని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్టు కూడా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. టెస్ట్ జట్టు నుండి భువీని తప్పించబడటానికి ఇది కూడా ఓ కారణమని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై భువనేశ్వర్‌ కుమార్‌ ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, ఆలాంటి అసత్య ప్రచారాలు రాయొద్దన్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ శనివారం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నాకు టెస్ట్ క్రికెట్ ఆడడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అందుకే స్పందిస్తున్నా. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా.. మూడు ఫార్మాట్లలలో ఆడడానికే నేను ఎప్పుడూ సన్నద్ధం అవుతుంటా. జట్టులోకి ఎంపికయినా.. కాకున్నా ఇదే పద్దతి ఫాలో అయ్యా. ఇకపై కూడా ఇలానే కొనసాగుతా. చివరగా ఓ సలహా.. మీ ఊహాగానాల ఆధారంగా అసత్య ప్రచారాలు రాయొద్దు’ అని భువనేశ్వర్‌ ట్వీట్ చేశాడు. భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు.

Related posts