telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నం…

corona vacccine covid-19

మన దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో రెండు రకాల కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి.  అందులో ఒకటి భారత్ బయోటెక్ కొవాగ్జిన్.  హైదరాబాద్ కు చెందిన ఈ ఫార్మా కంపెనీ తన రెండు ప్లాంట్ ల నుంచి కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్నది.  అయితే, కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోవడంతో దేశంలో వ్యాక్సిన్ కు డిమాండ్ పెరిగింది.  డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి.  దీంతో వ్యాక్సిన్ తయారీని మరింత వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ సిద్ధమైంది.  బెంగళూరులో ఓ ప్లాంట్ ను నిర్మిస్తోంది భారత్ బయోటెక్.  ఈ ప్లాంట్ నుంచి త్వరలోనే వ్యాక్సిన్ తయారీ అవుతుంది.  అదే విధంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న పానేషియా బయోటెక్ ఫార్మాతో భారత్ బయోటెక్ సంస్థ చర్చలు జరుపుతున్నది.  ఈ చర్చలు సఫలమైతే పానేషియా బయోటెక్ ఫార్మా కంపెనీ నుంచి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts