పంజాబ్‌లో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి అధికార పీఠం దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.అక్కడ మ్యాజిక్ ఫిగర్‌ను ఇప్పటికే దాటేసిన చీపురు పార్టీ.. వంద మార్క్ దిశగా సాగుతోంది.
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. ధూరి నియోజకవర్గం నుంచి 45వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ మీద ఘన విజయం సాధించారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆప్ 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కేవలం17 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. పదేళ్ల రాజకీయ ప్రయాణంలోనే భగవంత్ మాన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు.
పంజాబ్ పీపుల్స్ పార్టీ నుండి తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భగవంత్.. 2012లో లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2014లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. సుఖ్‌దేవ్ సింగ్ ధిండాను ఓడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా