కరోనా పై పోరుకు తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేయనుంది. ‘కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మెడికల్ ఈక్విప్‌మేంట్, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను తగ్గించేందుకు బోర్డు తమ వంతుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయనుంది.’అని ఆ ప్రకటనలో తెలిపింది. ఇక బోర్డు అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాధితులకు ఉపశమనం కలిగించడంతో పాటు వైరస్ నుంచి విముక్తిని చేసేందుకు సాయపడతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ‘వైరస్‌పై జరుగుతున్న ఈ యుద్దంలో వైద్యులు, ఆరోగ్య సంరక్షకులు చేస్తున్న పోరాటాన్ని బీసీసీఐ గుర్తించింది. వారు నిజంగా ఫ్రంట్‌లైన్ యోధులు. ప్రజలను రక్షించడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. బీసీసీఐ ఎప్పుడూ ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాధితులుకు తక్షణ ఉపశమనం అందించడమే కాకుండా కోలుకోవడానికి సహాయపడతాయి.’అని దాదా పేర్కొన్నాడు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేసింది.
previous post