telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమైక్య పాలకులు కూడా ఇంత తక్కువ ఫిట్‌మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు….

సమైక్య పాలకులు 25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదని….PRC వేసిన వెంటనే IR ఇవ్వడం సంప్రదాయమని… కానీ ఈ సర్కార్ IR కూడా ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే HRA తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపాడని ఫైర్‌ అయ్యారు. ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అని ఆశ చూపి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో ముగించాడని పేర్కొన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తా అని నిరుద్యోగులను, సన్నవడ్లు అని రైతులను ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసాడని మండిపడ్డారు. పది శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి ఓ కమిటీ వేయలా.. మూడేండ్లు టైమ్ తీసుకోవాలా అని నిలదీశారు. అసలు బిష్వాల్ కమిటీని స్వతంత్రంగా పని చేయనిచ్చారా అని పేర్కొన్నారు. ఉద్యోగులను నమ్మించడానికే బిశ్వల్ కమిటీ వేసారని.. ఆ కమిటీపై ఒత్తిడి పెంచి రిపోర్ట్ రాపించారని తెలిపారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి HRA 6 శాతం తగ్గించటం దారుణమన్నారు. 31 నెలల నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

Related posts