నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబల్ విత్ ఎన్బీకే, టాక్ షో కొద్ది కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుసగా క్రేజీస్టార్లని దింపుతూ క్రేజీగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది .క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల కానుంది.
తాజాగా 7వ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బాలయ్య.. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి సందడి చేశారు. ఇందులో మాస్ మహారాజా నుంచి పలు ఆసక్తికర విషయాలు బాలయ్య రాబట్టి నట్టు తెలుస్తోంది.
అయితే గతంలో బాలయ్య, రవితేజ మధ్య చాలా పెద్ద గొడవ అయిందని వార్తలొచ్చాయి. కానీ దీనిపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు తాజా ఎపిసోడ్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు రవితేజ.
ఈ ప్రమో మొదట్లో.. `మొదలు పెట్టే ముందు బాసూ మనం ఓ క్లారిటీ తీసుకోవాలి.. నీకు నాకు పెద్ద గొడవ అయిందటగా అని బాలయ్య ప్రశ్నించగా..దానికి సమాధానంగా రవితేజ తనదైన రీతిలో పనీపాటాలేని డాష్ నా డాష్ గాళ్లకు గాళ్ళకు ఇదే పని అంటూ నవ్వులు చిందించారు.
`నీకు కోపం వచ్చినపుడు వాడే నాలుగు బూతులు చెప్పు సరదాగా` అని బాలయ్య అడగ్గా.. `నేను బూతులు మొదలు పెడితే చస్తారు కానీ` అన్నారు రవితేజ. అతి వినయం ధూర్త లక్షణం.. చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోయినట్టే` అని బాలకృష్ణ అనగా.. `అవతల వాడి బిహేవియర్ ని బట్టి వీడు తేడా గాడు అనే విషయం తెలిసిపోతుంది కదా మీకు` అని చెప్పడం నవ్వులు పూయించింది.
మనువరాజు పురం `అమ్మాయిలకు లైన్ వేసేవాడివంట కదా` అని బాలయ్య అడగ్గా, `ఈ విషయాలన్నీ మీకు ఎవరు ఇచ్చారు?` అంటూ అవాక్కయ్యాడు రవితేజ. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ.. `మాది కృష్ణా జిల్లాయే బాసూ..అని బాలయ్య అంటారు.
నీ కొడుకు నీ కంటే టాలెంట్ కదా అని రవితేజని అడగ్గా ` అని బాలయ్య అడగ్గా.. `అందుకే వాడికి DNK అని పేరు పెట్టుకున్నా.. DNK అంటే దొంగ నా కొడుకు` అని రవితేజ చెప్పడం నవ్వులు పూయించింది.
అలాగే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా గతంలో రవితేజ పేరు తెరపైకి వచ్చింది.`హెల్త్ కి, ఫిట్ నెస్ కు ఎంతో వాల్యూ ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు` అని అని ప్రశ్నించగా, `అందరి కంటే ముందు నాకే ఆశ్చర్యమేసింది. ఎక్కడ బాధ పడ్డానంటే.. పెంట పెంట చేశారు.. అది కొంచెం బాధేసింది` అని రవితేజ చెప్పుకొచ్చారు.
అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని ఆహ్వానించారు. `గతంలో ఓసారి అరెస్ట్ అయ్యావంట కదా` అని బాలయ్య ప్రశ్నించారు. ‘సమరసింహారెడ్డి’ సినిమా విడుదల సమయంలో అరెస్ట్ అయ్యానని దర్శకుడు గోపీచంద్ తెలిపారు. బాలకృష్ణతో రవితేజ గొడవ గురించి.. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం గురించి వెల్లడించిన అంశాలు హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఎపిసోడ్ డిసెంబర్ 31 న స్ట్రీమింగ్ కానుంది.