telugu navyamedia
ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ వారి ఫుడ్‌ ఇలా తీసుకోవాలి..

ఉరుకులు పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యం కోసం చాలా మంది పలు పద్దతులను అవలంభిస్తుంటారు. అయితే రోజూ వారి ఫుడ్ ఎలా తినాలి ఏం తినాలి అనేది తెలుసుకుందాం..

1. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌‌లో ప్రొటీన్లు కలిగిన పదార్థాలలో కొబ్బరి నీళ్లు ఉండాలి. టిఫిన్‌‌లోకి మూడు ఎగ్‌‌వైట్స్‌‌, ప్రొటీన్ ఉండే శెనగలు, నట్స్ ఉండాలి.

I Tried Egg Whites For Breakfast Every Day—Here's What Happened'

2 . ఒక వేళ వెజిటేరియన్స్ అయితే గుడ్డుకు బదులుగా 100 గ్రాముల పన్నీర్ తిన‌వ‌చ్చు, లేదా శ‌న‌గ‌లు తీసుకోవ‌చ్చు.

3. లంచ్‌‌కి ముందు ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒ‍క టీ స్పూన్‌‌ నానబెట్టిన వేరుశెనగలు తినాలి. భోజనం చేసేటప్పుడు అన్నంతో పాటు ఒక కప్పు పెరుగు, వంద గ్రాముల పన్నీర్‌‌, ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి. రొట్టెతో పప్పు లేదా బెండకాయ, కూరగాయలు తింటే సరిపోతుంది.

Girl Eat Rice and Seafood Stock Footage Video (100% Royalty-free)  1007886481 | Shutterstock

4. మధ్యాహ్నం మూడింటికి అంటే లంచ్ చేసిన రెండు గంటల తర్వాత ఏవైనా ఫ్రూట్స్ తీనొచ్చు. అవి కూడా షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అయితే బెటర్.

5. సాయంత్రం ​పూట శ్నాక్స్ తినాలనిపిస్తే లైట్‌‌ ఫుడ్‌‌ చిప్స్‌‌, బిస్కెట్స్‌‌ లాంటి వాటిని తినాలి. అవసరమైతే అవకాడో లాంటివి కలిపి తినొచ్చు. శ్నాక్స్ తినమన్నారు కదాని ఎక్కువ తినొద్దు.

Quick and Easy Mushroom Soup Recipe – AllAboutKiids

6. ఏడు గంటలకి మష్రూమ్‌‌ సూప్‌‌ లేదా వేడిగా ఏవైనా సూప్స్ తీసుకుంటే ఈవెనింగ్ యాక్టివ్‌‌గా ఉంటారట.

7. డిన్నర్ చేసేటప్పుడు బ్రౌన్‌‌రైస్‌‌ అన్నంతో పాటు 150 గ్రాముల సోయా పన్నీర్ (టోఫూ) ఉండేటట్లు చూసుకోవాలి.

8. లేదంటే రెండు చపాతీలతో ఎక్కువ వెజిటబుల్స్ ఉండే మెనూ రెడీ చేసుకోవాలి. రాత్రి పూట వీలైనంత వరకూ నాన్ వెజ్ వద్దు నిద్రకి ముందు నానపెట్టిన అయిదు బాదం గింజల్ని తినడం మంచిది.

Is Wheat Chapati Good for Diabetes?

వీటిన్నిటితో పాటు ఆర్గాన్స్‌‌ పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల గోరువెచ్చని నీళ్లని ప్రతీ రోజు తాగాలి.  పొద్దున్నే నిద్ర లేవాలి..ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.దీంతో మీ రక్త ప్రసరణను కూడా పెంచుతుంది..

Related posts