telugu navyamedia
క్రీడలు

దేశం కంటే వరల్డ్‌కప్ గొప్పది కాదు: అజర్

Azaruddin,World Cup
వరల్డ్‌కప్ అయినా సరే పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని ఇటీవల  స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా హర్భజన్ వ్యాఖ్యలను సమర్థించాడు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే.. ఇక ఎక్కడా ఆ టీమ్‌తో ఆడకూడదని. నేను హర్భజన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వరల్డ్‌కప్ దేశం కంటే గొప్పదేమీ కాదు అని అజర్ అనడం విశేషం. అజర్ మూడు వరల్డ్‌కప్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మూడు టోర్నీల్లోనూ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఇండియానే గెలిచింది. 
కార్గిల్ యుద్ధం నేపథ్యంలో 1999 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు అజారుద్దీనే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. అప్పటి మ్యాచ్ నేపథ్యాన్ని అజర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అప్పుడు  యుద్ధం కొనసాగుతున్నది. ఆ సమయంలో స్టేడియంలో ప్రేక్షకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటారని భయపడ్డాం. మేము గెలిచినప్పుడు సైనికులు సంబరాలు చేసుకున్నారు. ఒకవేళ పాకిస్థాన్‌తో ఆడితే ఎక్కడైనా ఆడండి. లేకపోతే ఎక్కడా ఆ టీమ్‌తో ఆడొద్దు. ఈ విషయమై  ఐసీసీ, బీసీసీఐ త్వరగా పరిష్కరించాలని అజరు పేర్కొన్నారు.

Related posts