telugu navyamedia
సామాజిక

పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటే చికెన్‌ ధర తగ్గింపు!

Pakistan Murdabad,chiken rate
జమ్ము కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాక్  దుచ్చర్య పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో ఒక ఫుడ్‌ స్టాల్‌ ఓనర్‌ తన కస్టమర్లకు చికెన్‌ లెగ్‌ పీస్‌పై 10 రూపాయిలు తగ్గించి విక్రయిస్తున్నాడు. అయితే దీనికి ఆయన ఒక షరతు పెట్టాడు. అక్కడికి వచ్చిన వారు మనస్ఫూర్తిగా పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అని నినాదాలు చేయాలి. అంజల్‌ సింగ్‌ అనే ఒక ఫుడ్‌ స్టాల్‌ ఓనర్‌ ఈ పద్ధతి ప్రవేశపెట్టాడు. మానవతా విలువలను పాకిస్తాన్‌ ఎన్నడూ గౌరవించలేదని, ఇక మీదట కూడా గౌరవించదని అంజల్‌ సింగ్‌ చెప్పాడు. అందుకే ప్రతి ఒక్కరూ పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అనాలని, అది కూడా మనస్ఫూర్తిగా అనాలని అంజల్‌ సింగ్‌ అన్నాడు.

Related posts