telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాపై భారత్ భారీ ఆధిక్యం

India

బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత్ 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై 241 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోరు 174/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో రహానే (51) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత తైజుల్ ఇస్లాంకు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో 27వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 12 పరుగులు చేసి అబు జాయెద్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత నుంచి వికెట్ల పతనం ప్రారంభమైంది. 136 పరుగులు చేసిన కోహ్లీ ఆరో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేశాడు. ఆ వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టాడు.

Related posts