భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తన మొదటి వికెట్ కోల్పోయింది. సిబ్లీ(3) ను ఔట్ చేసి ఈ ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు అక్షర్ పటేల్. దాంతో 17 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శతకంతో 329 పరుగులు చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ ను 134 కే ఆల్ ఔట్ చేసి 195 పరుగుల ఆధిక్యంలో ఉంటుంది. దాంతో చెన్నై టెస్టులో టీమిండియా రాణించింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సత్తాచాటడంతో.. ఇంగ్లండ్‌ను పూర్తి డిఫెన్స్‌లో పడేసింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ సెంచరీ సాధించడంతో 286 పరుగులు చేసిన భారత్ ఇంగ్లాండ్ ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లీ కూడా అర్ధశతకంతో రాణించాడు అయితే ఈ రోజు ఆట ముగియడానికి ఇంకా 9 ఓవర్లు ఉండటంతో చుడాలిమరి ఈరోజు ఆట ముగిసేలోగా భారత బౌలర్లు ఎన్ని వికెట్లు తీస్తారు అనేది.
previous post
next post