ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పటికే తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈరోజు తొలుత ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు.
ఈ సమీక్షలు ఆదాయ వనరులపై అవగాహన కోసం జగన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఆర్థికస్థితి, పెండింగ్ బిల్లులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ భేటీలో ఓ అవగాహనకు రానున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈరోజు రాజ్ భవన్ లో ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు జగన్ హైదరాబాద్ కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



అతడి చెంప పగలగొట్టి, షర్ట్ కాలర్ పట్టుకుని… మెహ్రీన్ కామెంట్స్