telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రంజాన్ మాసంలో సౌదీ సంచలన నిర్ణయం!

saudi released 95 lakhs to hajj yatra disciple

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో  సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. మసీదులను తెరచివుంచితే కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మసీదులను మూసి వేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తరావీ నమాజ్ లను, రంజాన్ ఈద్ నమాజ్ ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు

వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సౌదీ అరేబియాలో ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. వారిలో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Related posts