*తిరుపతిలో సీఎం జగన్ పర్యటన ..
*వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్..
*ఆలయ ఆవరణలో మొక్క నాటిన సీఎం జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు తిరుపతి పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా తిరుపతి సమీపంలోని పేరూరికొండపై వకుళమాత ఆలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు పంచెకట్టులో సాంప్రదాయ పద్దతిలో వచ్చిన సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో ఆలయఅర్చకులు స్వాగతం పలికారు..
ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు రోజా, పెద్దిరెడ్డిలతో ఇతరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సీఎం జగన్ మొక్కను నాటారు.
కాగా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన లో భాగంగా పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇలగనూరులో అపాచి పాదరక్షలు తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
గత సందాయాలను పాటించలేదు: అచ్చెన్నాయుడు