telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీ ఎంసెట్ ప్రారంభం..ప్రతి విద్యార్థికి మాస్కు తప్పని సరి!

students masks exams

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ. ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్ష గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లతో మొత్తం 14 సెషన్లుగా 7 రోజులపాటు నిర్వహించనున్నారు.

కరోనా నేపథ్యంలో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి చేశారు. పరీక్షా కేంద్రాల్లో భౌతికదూరం ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు.గంటన్నర ముందు నుంచే హాల్‌లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామినేషన్ హాల్‌లోకి నో ఎంట్రీ. ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగా ధరించాలి.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్, 23 నుంచి 25వ తేదీ వరకు 14 సెషన్లలో ఏడు రోజుల పాటు సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు.

ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.ఈసారి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ.ఫార్మసీ విభాగాల్లో మొత్తం 2,72 ,900 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Related posts