ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు . ఏపీలో గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేస్తోంది. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
5.97 లక్షల మంది రైతులకు 542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.అలాగే.. 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ. 29.51 కోట్లను కూడా జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ..వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయని చెప్పారు. ఇక పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నామని, అయితే గత ప్రభుత్వ హయాంలో అరకొరగా సాయం అందేదని సీఎం జగన్ అన్నారు.
రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయని, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. వరదలతో కొన్ని ప్రాంతాల్లోని పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో రైతన్నలకు నష్టపరిహారం అందించిన తొలి రాష్ట్రామనదేనని వైఎస్ జగన్ అన్నారు.