telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ పై బదిలీ వేటుపడింది. ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని కొత్త డీజీపీగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిలీజెన్స్ చీఫ్‌తో పాటు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. 

ప్ర‌స్తుతం రాజేంద‌ర్ నాథ్. ఇంటిలీజెన్స్ డీజీగా ఉన్నారు. గతంలో విజయవాడ సీపీగా.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు.

ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేస్తూ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గౌతం సవాంగ్‌కు ఇంకా వచ్చే ఏడాది జూలై వరకూ ఆయన సర్వీసు ఉంది. 

మ‌రోవైపు.. ఛలో విజయవాడ కార్యక్రమంలో లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ నిర‌స‌న తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

 

Related posts