*గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులు
*గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం జగన్ పరామర్శ
*బుధవారం గౌతం రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్
*గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం
*సీఎం జగన్ వెంట వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు గౌతమ్‌రెడ్డిని నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. ఆయన గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని హత్తుకుని ఓదార్చారు.
సీఎం జగన్‌ను చూసిన గౌతమ్‌రెడ్డి తల్లి, భార్య పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యుల రోదనలను చూసి.. జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన పక్కనే ఉన్న రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు.
సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.