పెళ్లిపీటలపై కుప్పకూలి చనిపోయిన నవ వధువు కేసులో చిక్కుముడి వీడింది. ప్రేమ వ్యవహారం కారణంగా పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు
పోలీసుల విచారణలో తెలింది.
వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌కు చెందిన ముజేటి ఈశ్వరరావు, అనురాధ దంపతులు వారి కుమార్తె సృజనకు టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పీఎం పాలెంకు చెందిన నాగోతి శివాజీ(29)తో వివాహం నిశ్చయించారు.
అయితే పెళ్ళికి ముహూర్తానికి ముందు .. వరుడు వధువు తలపై జీలకర్రా బెల్లం పెడుతుండగా నవ వదువు కుప్పకూలింది. దీంతో ఒత్తిడి, అలసట కారణంగా గుండెపోటు కు గురై ఉంటుందని అంతా అనుకున్నారు. అప్పటి వరకు నవ్వులు, ముచ్చట్లు, మంగళవాయిద్యాలతో సందడిగా కనిపించిన ఆ పెళ్లిమండపం లో విషాదం నెలకొంది. ఆ షాక్ నుంచి అంతా తేరుకుని ఆస్పత్రికి తరిలించారు.. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు చెప్పడంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది.
సృజన పెళ్లికి సుముఖంగా లేకపోవడంతో ఏదో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. సృజన ఇష్టంతోనే పెళ్లి నిర్ణయం జరిగిందని అన్నారు. పెళ్లికి రెండు రోజులు ముందు నుంచి సృజన అనారోగ్యంతో ఉన్నట్టుగా చెప్పారు.
అయితే అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. ఆమె ఫోన్ డాటా ఆదారంతో నిజాలు వెలుగు చూసినట్లు తెలిపారు. పెళ్లికి 3 రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చిన మోహన్.. కొంత సమయం ఉండాలని సృజనకు చెప్పాడు.ఈ క్రమంలో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి సృజన హామీ ఇచ్చింది. విష పదార్థం తీసుకోవడంతో పెళ్లి రోజు సృజనకు ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా: లక్ష్మీనారాయణ