ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 7,943 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,93,085 కు చేరింది. ఇందులో 15,25,465 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,53,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 98 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 10,930 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 19,845 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 83,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
next post
జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు: తులసిరెడ్డి