telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్-చైనా ఉద్రిక్తతలపై రాహుల్ మరోసారి అనుమానాలు

Rahul gandhi congress

తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద నెలకొన్న భారత్-చైనా ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను దాస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గాల్వన్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణలు నెలకొంటున్న వేళ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రాహుల్ కొన్ని రోజులుగా నిలదీస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి గాల్వన్‌ ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

చైనా దాడికి వ్యతిరేకంగా అందరం ఏకమై నిలబడతాం. అయితే, భారత భూభాతాన్ని చైనా ఆక్రమించిందా?’ అని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకుని రాలేదంటూ ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నిన్న కూడా ప్రస్తావించారు. ‘ఘర్షణ నెలకొన్న సమయంలో ప్రధాని మోదీపై చైనా ఎందుకు ప్రశంసలు కురిపిస్తోంది?’ అని రాహుల్ ప్రశ్నించారు.

Related posts