*నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
*రాజధానిపై చర్చిస్తామని వైకాపా నేతలు..
*గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి గా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు.
సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం ఉంటుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే అంశం ఈ భేటీలో నిర్వహిస్తారు.
బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతోపాటు మరిన్ని అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
రెండో రోజు(మంగళవారం) దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఉభయ సభలు సంతాపం తెలుపుతాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. మార్చి 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడుతారు.

