telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎంత అల్లరి జరిగినా.. పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేది లేదు.. : అమిత్ షా

amith shah bjp

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసనలు వెల్లువెత్తినప్పటికీ, వెనక్కితగ్గే ప్రసక్తి లేదని హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. పొరుగు దేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటూ దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించి భారతీయులుగా గౌరవంగా జీవించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు మిన్నంటిన క్రమంలో ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఏ ఒక్కరి జాతీయతా కోల్పోవడం జరగదని ఆందోళనకారుల అభ్యంతరాలను పోగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ చట్టంపై ఎవరికైనా సరే ఎలాంటి భయం అవసరం లేదని మన విద్యార్ధులు, ముస్లిం సోదరులకు తాను విన్నవిస్తున్నానని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరూ భారత పౌరసత్వం కోల్పోరని భరోసా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని ప్రతి ఒక్కరూ దాన్ని నిశితంగా పరిశీలించవచ్చని సూచించారు. తాము అందరికీ అభివృద్ధి నినాదంతో ముందుకెళతామని ఏ ఒక్కరికీ అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. విపక్ష కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

Related posts